ఆడియో రివ్యూ

శ్రీమంతుడు
movie image view

శ్రీమంతుడు

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతలు  నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం.) నిర్మించిన చిత్రం ‘శ్రీమంతుడు’. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. విక్టరీ వెంకటేష్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని ఆంధ్రప్రదేశ్ మినిష్టర్ గంటా శ్రీనివాసరావుకి అందించారు.  హీరోగా తెలుగు ఇండస్ట్రీలో 50 వసంతాలను పూర్తి చేసుకున్న కృష్ణకి అతిథులందరూ సన్మానం చేశారు. 

1. శ్రీరాముడు..... రాములోడు వచ్చినాడురో తస్సదియ్య శివధనుస్సు ఎత్తినాడురో.... కార్తికేయ, సరోజ్ సంతోష్ రానినరెడ్డి... మంచి ఫాస్ట్ బీట్ సాంగ్... మ్యూజిక్ వింటే డాన్స్ చేయాలన్నంత బాగుంది.

2. జతకలిసె... జతకలిసె.... జగములు రెండు జతకలిసె.... సాగర్, సుచిత్ర... ఈ పాట చాలా మెలొడియస్ గా ఉంది.

3. చారుశీల స్వప్నమాల యవ్వనాల ప్రేమ పాఠశాల... మల్లె పూల... యాజిన్ నిజార్, దేవిశ్రీ ప్రసాద్ పాడారు. ఈ పాట కూడా వినసొంపుగా ఉంది.

4. ఓ నిండు భూమి నిను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా.... ఎం.ఎల్.ఆర్ కార్తికేయ సోలో సాంగ్ చాలా బాగుంది.

5. జాగో.... జాగోరె... జాగో... జాగోరె.... జాగో....  రాఘు దీక్షిత్, రీటా పాడారు. చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది.

6. ఎవడు కొడితే మైండ్ బ్లాకై పోద్దో వాడే నా మొగుడు... సింహ, గీతామాధురి, ప్రియ హేమేష్ పాడారు. చాలా బాగుంది.

 

బాహుబలి
movie image view

బాహుబలి

రాజమౌళి సినిమాలే కాదు... సినిమాలోని పాటలూ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే.... తమ్ముడుగారి దర్శకత్వం... అన్నగారు కీరవాణి సంగీతం... రెండూ కలిపితే ఓ దృశ్యకావ్యం... బాహుబలి సినిమాకోసం నిరీక్షణ ఒక ఎత్తు... ఈ సినిమా ఆడియో వేడుక కోసం నిరీక్షించడం ఒక ఎత్తయ్యింది.  ఎట్టకేలకు తిరుపతిలోని వేంకటేశుని సన్నిధిలో పాటలు విడుదల (జూన్ 13) చేశారు. అన్ని పాటలు సందర్భానికి తగినట్టు రాసినవిగా తెలుస్తోంది.... రామజోగయ్య, శివశక్తి దత్త మంచి పదాలను జోడించి... అర్థవంతంగా రాశారు పాటలను. పాటలు అన్నీ కాదు గానీ... యవ్వడంట యవవ్వడం... నిప్పులే శ్వాసగా... అనే రెండు పాటలు ఉద్వేగభరితంగా ఉన్నాయి.  దీవరా... మనోహరా... మమతల తల్లీ... చాలా వినసొంపుగా శ్రావ్యంగా అనిపిస్తున్నాయి....

  1. మమతల తల్లీ... బాహుబలి... లాలల తేలి... సూర్య-యామిని పాడారు. ఇది బ్యాక్ గ్రౌండ్ పాటలా అనిపిస్తుంది. బాగుంది.
  2. బంగారు కలల్ని... గుండెలోతు గాయాల్ని... కడుపులో దాచుకున్న జీవనదీ....గీతా మాధురి పాడింది ఈ పాటను. చాలా హార్ట్ టచింగ్ గా ఉంది...
  3. అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా...... దీవర... దరికి చేర రార... చెలి నీదేరా... దీపు-రమ్య బెహరా పాడారు ఈ పాటను....చాలా మెలొడియస్ గా అనిపించింది.
  4. యవ్వడంట యవ్వడంట... నిన్ను ఎత్తుకుంది... ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది... ఎవ్వరూ కనంది... ఎక్కడా వినంది... శివుని ఆన అయ్యిందేమో... గంగదరికి లింగమే కదిలొస్తానంది... కీరవాణి పాడిన ఈ పాట చాలా చాలా బాగుంది... లిరిక్స్ కూడా చాలా బాగా రాశారు...
  5. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా... జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలనే తెచ్చకుంటా దొరా...కార్తీక్-దామిని పాడారీ పాటను. ప్రాస బాగా కుదిరి వినసొంపుగా అనిపిస్తుంది.
  6. ఇరుక్కుపో.... హత్తుకొని వీరా... వీరా... కొరుక్కుపో... నీ తనివి తీరా తీరా...తొణక్క బెణక్క... ఉలక్క పలక్క... దుడుక్కు పని చెయ్ రా మనోహరా... మనోహరా... మోహన భోగరాజు-రేవంత్ పాడారు... ఇందులో కూడా ప్రాస ఎక్కువగా ఉంది... రాజనర్తకి పాటేమో ఇది అనిపిస్తోంది....
  7. నిప్పులే శ్వాసగా... గుండెలో ఆశగా తరాల ఎదురు చూపులో ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు.. రాజ్యమాఉలికి పడు... కీరవాణి పాడిన ఈ పాట ఉద్వేగభరితంగా అనిపిస్తోంది...
  8. దీవర... (ఇంగ్లీష్ వర్షన్)... రమ్య బెహరా, ఆదిత్య పాడారు. 
జ్యోతి లక్ష్మి
movie image view

జ్యోతి లక్ష్మి

డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ మొట్టమొదటి సారిగా దర్శకత్వం వహిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ‘జ్యోతిలక్ష్మీ’. ప్రముఖ హీరోయిన్‌ చార్మీ ఓ వేశ్య పాత్రలో కనిపిస్తుంది. తన చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుంది. స్త్రీ జాతిపై మగజాతి ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుంది.

జ్యోతి లక్ష్మి కాసుకోరా సాంబ నేను అలాటపా దాని కాను - ఉమ, నేహ పాడారు ఈ పాటను... ఐటమ్ సాంగ్ లా ఉంటుంది.

నిను చూడంగ... మనసేమో గంగ... హేమచంద్ర పాడారు మంచి క్లాసిక్ టచ్ ఇచ్చినట్టుగా ఉంది

ఓ చూసింది చాలు గానీ... చూపించరా చొరవ...  శ్రావణ భార్గవి... పాట చాలా బాగుంది...

వొద్దొద్దు... అనుకుంటు న్న నచ్చేశావ్...  వేణు, ప్రణవి పాడిన ఈ పాట కూడా మంచి మెలోడీగా ఉంది

కంటి పాపే కన్నీరు పెడితే... కంటి రెప్పే ఓదార్చుకోదా... లిప్సిక పాడిన ఈ పాట ట్రాజెడీ పాటగా అనిపిస్తుంది... లిరిక్స్ బాగున్నాయి.

చేతికి గాజులు తొడిగి... చేతకానోళ్ళయి పోయామా...  శ్రావణ భార్గవి పాడిన ఈ పాటలోనూ మీనింగ్ బాగుంది...

రాజా... రాజా... నా టార్జాను నువ్వేనురా..   ఉమా నేహ పాడిన పాట... ఐటమ్ సాంగులా ఉంది...

కేరింత
movie image view

కేరింత

శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందించారు. సాయి కిరణ్ అడవి దర్శకుడు.. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం (మే 25న) హైదరాబాద్ లో జరిగింది. సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్విలతోపాటు మరికొందరు కొత్త నటీనటులతో దిల్ రాజు తీసిన యూత్ మెచ్చే చిత్రం కేరింత. ఇందులోని పాటలు బాగున్నాయి. కానీ ఇంతకు ముందు ఇలాంటి పాటలు విన్నట్టుగా అనిపిస్తున్నాయి....

1. రైట్ నౌ మొదలైంది నా కథ... కేరింత... (టైటిల్ సాంగ్) పాడిన వారు హరి చరణ్... ఒక మాదిరిగా ఉంది.
2.  వెన్నెల... వెన్నెల... తొలకరి వానలా...త లపులు నీకలా... తడిపెను మిలమిల... మిల మిల... మెరుపుల... పాడిన వారు కార్తీక్... మాధుర్య ప్రధానమైన పాట ఇది బాగుంది...
3. జగేదేక   వీర... ధీర... జాలేస్తుంది నీపైనా... పనిమాల వెనకాలొస్తే. పడిపోతానా నేనైనా...నన్ను వదిలేట్టు చేస్తా... అంజనా సౌమ్య పాడారు.. ఇది వెంట పడుతున్న అబ్బాయిని అమ్మాయి టీజ్ చేస్తున్నట్టుగా ఉంది.... పాట బాగుంది...

4. ఓహో...ఓహో... గెట్ రెడీ టచ్ చేద్దాం నింగి నక్ష్రతాన్ని... ఫుల్ టూ పండుగే పండుగ.. దిల్ సేబోల్.... థ్యాంక్స్ టూ జిందగీ.... రాహుల్ నంబియార్, దీపు, శిల్ప పాడారు... లైఫ్ ను ఎంజాయ్ చేసే కుర్రకారు పాడుకున్న పాటలా ఉంది... ఫరవాలేదు...

5. తలచినచో జరుగుననీ... కలనిజమై దొరకునని అరెరెరె... అనుకలేదే ఎపుడూ...పలికెనులే నాలో సుమగంధాల తేలింది గాలంత... వాన విల్లల్లే మారింది నేలంతా...మౌనరాగాలు పాడింది.. మనసంతా... నమ్మనా నేనీ వింత... కార్తీక్ పాడారు ఈ పాటను... ఇది బాగా విన్న పాటలా అనిపిస్తోంది... (హాపీడేస్ పాట) బాగుంది.... కానీ కొత్తదనం లేదుగా....

6. ఏ కథ టు పరుగెడుతుందో తెలియదే... ఏ క్షణం పుడేం చేస్తుందో...జోనితా గాంధీ పాడారు. ఇది కూడా విన్న పాటలా ఉంది....లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సాంగ్ లాగా....

శీనుగాడి లవ్ స్టోరీ
movie image view

శీనుగాడి లవ్ స్టోరీ

ఉదయనిధి స్టాలిన్‌, నయనతార జంటగా నటించగా ఘన విజయం సాధింంచిన తమిళ చిత్రం ‘ఇదు కదిరివేలన్‌ కాదల్‌’ తెలుగులో ‘శీనుగాడి లవ్‌స్టోరి’ పేరుతో అనువదించారు. ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, తెలుగు ఆడియోను విడుదల చేశారు, హారిస్‌ జైరాజ్‌ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ పాటలన్నీ వనమాలి రాసారు. ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్‌ ‘శీనుగాడి లవ్‌స్టోరి’ బిగ్‌ సీడిని లాంచ్‌ చేయగా.. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఆడియోను ఆవిష్కరించి, తొలి ప్రతిని హీరో శ్రీకాంత్‌కు అందజేసారు. 

సారా సారా సారామణి... కె.జి.రంజిత్, శ్రీలేఖ పార్థసారథి
ఎవరే ఎవరే... ఆలాప్ రాజు
బల్లారి సెంటర్లో... టిపు, ఎం.ఎల్.ఆర్.కార్తికేయన్
వాలే వాలే గువ్వల్లే... కార్తీక్
నువ్వే... నువ్వే... హరీష్ రాఘవేంద్ర, హరిణి.

రాక్షసుడు
movie image view

రాక్షసుడు

సూర్య హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘మాస్' చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు' పేరుతో విడుదల చేశారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేశారు. కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో మేధ క్రియేషన్స్ వారు విడుదల చేస్తున్నారు. కృష్నారెడ్డి, రవీందర్ రెడ్డి నిర్మాతలు. రాక్షసుడు ఆడియోను హైదరాబాద్ లో తెలుగు తమిళ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పాటలు క్లాస్, మాస్ మెచ్చే విధంగా ఉన్నాయి.

  1. మాస్ సాంగ్... కార్తీక్, సూరజ్
  2. నీ నీడవుతా... కార్తీక్, చిన్మయి
  3. బూజీ బూచయ్... రాకేందు మౌలి, పూజ
  4. కోన్ మాన్... యువన్ శంకర్ రాజా
  5. జననం నుంచి... మాలతీ లక్ష్మణ్
  6. మాస్ (థీమ్)... యువన్ శంకర్ రాజా
  7. మాస్ (రీమిక్స్)... కార్తీక్, సూరజ్, ప్రేమ్ జీ
  8. సూపర్ మాస్... ఎం.ఎం.మాన్సి, నివాస్...