ఆడియో రివ్యూ

జాదూగాడు
movie image view

జాదూగాడు

జాదూగాడు సినిమాలోని ఐదు పాటలూ ఆకట్టుకునేలా ఉన్నాయి.

సాగర్ మహతి మాస్ కు నచ్చే విధంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు.

  1. జాదూగాడూ... టైటిల్ సాంగ్... సీన్స్ కు బ్యాక్ డ్రాప్ గా వస్తుంది..
  2. ఎబిసి ఎబిసి నేర్పించవె నీ ఒళ్లో... లిరిక్స్ వింటేనే ఇదో లవ్ సాంగ్ అని అర్థమై పోతుంది. దీన్ని హీరో నాగశౌర్య, సోనారికా మీద చిత్రీకరించారు. సోనారికా పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందమంతా ఒలక బోసింది...
  3. ఏ పార్వతి... గోల చేద్దామే పిల్ల... ఇది కూడా యుగళ గీతం...హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించారు... కాకపోతే... ఈ హీరోయిన్ మొదటి హిందీ సీరియల్ లో పార్వతిగా నటించింది. మరి ఈ సినిమాలో ఈమె పేరు పార్వతి అని పెట్టారేమో... పార్వతిగా ఎంతగౌరవం కలుగుతుందో... సినిమాలో మాత్రం అలాంటి భావం ఏ మాత్రం కలగదనుకోండి... ఆ పార్వతేనాఅనుకునేలాఉంది.
  4. కథ ముదిరెగా... ఇది కూడా కథను అనుసరించే సీన్స్ తో సాగే ఓ బ్యాక్ డ్రాప్ సాంగ్...
  5. తొడగొట్టేవాడికి... ఎదురౌతాడు ఎవ్వరూ... అంటూ ఓ క్లబ్ లో ఐటమ్ సాంగ్ గా ఇచ్చారు... కానీ... ఇందులో నాగశౌర్య హీరోయిజం చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది.. మొత్తానికి సీన్స్... పాటలు చూస్తున్నంత సేపు... మహేష్ బాబు సినిమాలు పోకిరీ... బిజినెస్ మాన్... దూకుడు... ఒక్కడు సినిమాలోని కొన్ని సీన్లు చూస్తున్నట్టు అనిపిస్తుంది.
లయన్
movie image view

లయన్

లయన్ సినిమా ఆడియో ఫంక్షన్ గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ ఆడియోను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విడుదల చేయడం విశేషం.... అన్ని సినిమా ఆడియో ఫంక్షన్లు సినిమా వారితో, సినిమా అభిమానులతో నిండిపోతే... ఈ ఆడియో ఫంక్షన్ కు సగం మంది రాజకీయ నాయకులు హాజరు కావడం విశేషం. అయితే లయన్ ఆడియోలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. మణి శర్మ సంగీతం అందించిన ఈ ఐదు పాటలూ ప్రేక్షకులను అలరిస్తాయనడంలో సందేహమే లేదు... బాలయ్య ఇంతకు ముందు సినిమా పాటల్లాగానే మాస్ సాంగ్స్ మూడు అదరగొట్టేలా ఉన్నాయి.... ఒక పాట కాస్త క్లాసికల్ జోడించి మెలొడీ అందిస్తే, మరో సోలో సాంగ్ ఎ.జేసుదాసు పాటను గుర్తు చేసేలా ఉంది.

  1. వన్ అండ్ ఓన్లీ లయన్... లయన్... (ఇది టైటిల్ మాస్ సాంగ్. 4.02 ని.), రామజోగయ్య శాస్త్రి రాశారు. రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి, ప్రణవి గాత్రం అందించారు.
  2. డోల్ బాజా... తొలి చూపే విసిరాడే... (ఇది క్లాసికల్ టచ్ తో మెలోడీని అందిస్తుంది 4.31 ని,) భాస్కర భట్ల రవికుమార్ రాశారు. విజయ్ ప్రకాశ్, శ్రీనివాసశర్మ, ప్రణవి పాడారు.
  3. పిల్లా నీ కళ్ళకున్న కటుక సూపర్... (ఇది పక్కా మాస్... జనపదం మేళవించిన పాట 4.25 ని.,) రచన భాస్కరభట్ల రవికుమార్, పాడింది సింహ, సుధామయి.
  4. ఐసా అంబాని పిల్లా (ఇది బాలయ్య త్రిషను టీజ్ చేస్తున్న మాస్ పాట 4.18 ని.,) రచయిత శ్రీమణి, పాడింది స్వీకార్, అగస్తి, ఉమనేహ.
  5. అనగా... అనగా.. అష్టమిలో జన్మించావట... (మెలోడీ సోలో సాంగ్ జె.ఏసుదాసు పాడాడా అన్న భ్రమ కలిగింది. 4.23 ని.,) రచించిన వారు రామజోగయ్య, పాడిన వారు మధుబాలక్రిష్ణ.

మణిశర్మ అందించిన ఈ పాటల వేడుక ఏప్రిల్ 9, 2015లో  జరిగింది లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.